సిహెచ్ వి ప్రభాకర్ రావు
భారత కేంద్ర
ప్రభుత్వం రట్=తెలంగాణ రాష్ట్రానికి లక్ష
కోట్ల నిధులు ఇస్తున్నట్లు ప్రకటించిన భారతీయ జనతా పార్టి పలు సందర్భాలలో
ప్రకటించింది. ఒక రాష్ట్రానికి కేంద్రం లక్ష కోట్లు ఇవ్వడం సంతోషమే కాని మన
రాష్ట్రం నుండి కేంద్రం ఆదాయ పన్ను, అమ్మకం పన్ను ఎక్సైజ్ పన్ను, కష్టం పన్ను,
ఆపన్ను ఈపన్ను అంటూ వివిధ పన్నుల రూపంలో ఎన్ని లక్షల కోట్లు వాసులు చేస్తుందో
మాత్రం చెప్పడం లేదు. సాధారణం గా కేంద్రం ఎ రాష్ట్రానికైనా అన్ని గ్రాంట్
లు,సబ్సిడీ నిధులు, ప్రనాలికేతర నిధులు, రహదారుల నిధులు ఇతర అభివ్రిద్ది పథకాల
నిధులు అన్ని కలిపి 30శాతానికి మించి ఇవ్వవు. అల్లన్తప్పుడు అది బి జే ఫై
ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ పార్టి ప్రభుత్వం అయినా రాష్ట్రాలకు ఇచ్చే నిధుల శాతం
లో మాత్రం మార్పు ఉండడం లేదు.
కేంద్ర ప్రభుత్వ
మంత్రులు, బి జే పి దేశాధ్యక్షులు అమిత్ షా తన ప్రసంగాలలో రాష్ట్ర ప్రభుత్వానికి
మేము ఇన్ని నిధులు ఇస్తున్నాము అంటే ఆయా వ్యక్తులు తమ స్వంత ఆస్తుల నుండి ఇచ్చినట్లు
ప్రకటించడం అంటే రాష్ట్ర ప్రజలను అవమానించడమే. రాష్ట్రం నుండి తీసుకెళ్ళిన నిధులను
70శాతం తమ ఖాతాలలో వేసుకొని రాష్ట్రాలకు ఇచ్చే ౩౦శాతాన్నికూడా ఎదో దానం
చేస్తున్నట్లు ప్రకటించడాన్ని అది ఎ
పార్టి నాయకులైనా, మంత్రులనైనా , మరెవరు అలాంటి ప్రకటనలు చేసినా ఖండించాల్సిందే.
సమాఖ్య దేశమైన
భారత దేశం లోని అన్ని రాష్ట్రాలు తమకంటూ ప్రత్యెక అస్తిత్వాన్ని కలిగి ఉన్నాయి.
దేశ చరిత్రలో ఎ జానపదం కాని ప్రాంతం కాని ఒకరి దయా దాక్షిన్యాలమీద ఆధారపడి లేదు.
యుగయుగాల చరిత్రను వివరించే పార్టీల నాయకులు ఒక సారి ఆయా కాలలలో మన దేశం ఎలా
ఉండేదో ఆత్మావలోకనం చేసుకోవాలి. గతాన్ని విస్మరిస్తే దేవుదేకాడు ఓటర్లు కూడా
క్షమించారు.
భారత దేశం వివిధ
భాషల, మతాల, జాతుల, వర్ణాల, వర్గాల, ఆచారాల, సాంప్రదాయాల సమాహారం. వేదకాలం నుండి
వైరుధ్య భావాలతో, సమున్నత జ్ఞాన సముపార్జనకోరకు నిరంతరం పోటిపడ్డ వైవిధ్య భరిత
చరిత్ర గల మహా జనసమూహాల కూటమి. భారత దేశం అనే జానపదం ఉన్కిలోకి ఎప్పుడు వచ్చిందో
ఇదమిద్దంగా చెప్పే ఆధారాలు ఎలాఉన్నా ఉత్తర, పశ్చిమ, దక్షిణ, మద్య,తూర్పు భారత
దేశాలుగా విడివిడిగా తమ ప్రత్యెక ఉనికిని చాటుకొనే ప్రయత్నాలు మాత్రం కారిత్రలో
కనబడుతాయి.
చరిత్ర పూర్వ
భారత దేశం కాని, శ్రీరాముని కాలం నాటి దేశం కాని, శ్రీ కృష్ణుని కాలం నాటి భారత
దేశం కాని, ఆ తరువాత మొఘల్ పాలన కాని చేఇవారికి ఆంగ్లేయుల కాలం లో కాని ఎప్పుడు
భారతదేశం మొత్తం ఒకే వ్యవస్థ కింద, ఒకే ఆధిపత్యం కింద ఉన్న దాఖలాలు లేవు.
భారతదేశ చరిత్రలో
మన సాంప్రదాయాలకు, ఆచాల్రాలకు అనువ్కాని ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ తో సహా పాకిస్తాన్,
బెలూచిస్తాన్, శ్రీలంక, రంగూన్ లాంటి ప్రాంతాలుకూడా అప్పుడప్పుడు భారత రాజ
వంశాలుగా చెప్పుకొనే వారి ఆధీనంలో ఉండేవి. కాని అదే వింధ్య పర్వతాల కింది వైపు
ఉండే ప్రాంతం, నేటి దక్షిణ భారతదేశం ఎప్పుడు తన ప్రత్యేకతను తెలుపుకొంటూ,దక్షిణ
దేశంగా, ప్రాంతంగానే గుర్తింపు పొందింది. అల్లాంటి దక్షిణ దేశాన్ని పాలించాలనే
కోరిక చాలామంది రాజులలో కల గా నే మిఒగ్లిపోయింది. చివరికి మొఘల్ పాలకులుగాని,
ఆంగ్లేయులుకాని పూర్తీ దక్షినదేశాన్ని తమ పాలనలోకి తేలేకపోయారు.
కాని
స్వాతంత్రోద్యమకాలం లో దక్షిణ దేశ ప్రజలు ఉత్తర భారత ప్రజలతో కలిసి పోరాడి దేశ
స్వాతంత్రం తెచుకొన్నారు. అందరు ఒకే ప్రజలుగా, ఒకే దేశంగా ఉండాలనే తపన కొంతవరకైనా
భారత స్వాతంత్ర పోరాటం తరువాత నెరవేరింది. కాని మొదటినుండి దక్షిణ భారత రాష్ట్రాలైన
తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రలపట్ల ఢిల్లీ పాలకులకు ఒక
రకమైన చిన్న చూపే ఉంది. అందుకే డిల్లి పాలకులు ఎప్పుడు ఉత్తర భారత దేశ
ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నాలు చేయడం వాటిని దక్షిణ బారత దేశ ప్రజలు, నాయకులు
వ్యతిరేకించడం జరుగుతునె ఉంది.
చరిత్ర, సామాజిక
అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆనాటి రాజ్యాంగ రచయితలూ భారతదేశాన్ని వివిధ
రాష్ట్రాల సమాఖ్యగా వర్ణించారు. అదే విధంగా రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం అనే
మాటకు బదులుగా యునియన్ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనే పదాల్లు వాడారు. సంఖ్యా
పరంగా ఉత్తర భారత దేశ రాష్ట్రాలు ఎక్కువగా ఉండడం, అధికార పీటం ఐన దిల్లికి దగ్గరలో
;ఉండడమే కాకుండా పార్లమెంట్ కు అధిక సంఖ్యలో సభ్యులను పంపే రాష్టాలు అవదవల్ల కూడా
ఉత్తర భారత దేశ ఆధిపత్యం ఇంకా దక్షిణ భారత దేశ ప్రజలపై కొనసాగుతుంది.
దేశమంతా ఒకే భాష,
ఒకే ఆచార సామ్ప్రదెఆయలు లేవనే మన రాజ్యాంగ నిపుణులు దేశం లో వివిధ వర్గాల, మతాల,
ఆచారాల, సంప్రదాయాల ప్రజల ఆకాంక్షలను, ఉన్కిని కాపాడడానికి రాజ్యాంగంలో ప్రత్యెక
ఏర్పాట్లు చేసారు. వాటన్నిటిని కాదని సమాఖ్య ప్రభుత్వం ఆధిపత్య ధోరణి
ప్రదర్శించడాన్ని దక్షిణ భారత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
భారత దేశం లోని
వివిధ ప్రాంతాల అవసరాలకు తగ్గట్టు ఆయా ప్రాంత ప్రజలు తమ స్వంత క్ప్రభుత్వాలను
ఏర్పాతుచేసికొనే స్వేచ్చ రాజ్యాంగం లో ఉంది. అదే దేశ ఏకతా స్ఫూర్తి తో కొనసాగాలనే
అందరు ఆకాంక్షిస్తారు కూడా. భారత దేశ్జం ఒక్కటే. భారత ప్రజలు వారి వారి సంప్రదాయాలు
వేరైనా వారందరికీ భౌగోళికంగా, వారసత్వ చరిత్రా వాళ్ళ అందరు ఒకటే అనే భావన ఇంకా
ఉంది. కాని అందరు ఒకే వ్యక్తీ, లేదా ఏక ఆలోచనా ధోరణికి లేదా ఒకే సిద్దాంతానికి
కట్టు బానిసలుగా పది ఉండాలనే కొందరి వాదనకు దక్షిణ భారత దేశమే
కాదు ఈశాన్య భారతం కూడా వ్యతిరేకం.
భౌగోళికంగా
ప్రపంచం లోనే ఏంటో పెద్ద దేశం, జనాభాలో చైనాతరువాటి స్తానం మనదే. అలాగే ప్రపంచంలో
అత్పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న భారతదేశంలో ఒకే పార్టి లేదా
ఒకే వ్యక్తీ లేదా ఒకే రకమైన సిద్దాంత ఆలోచనలతో పరిపాలన కొనసాగించడాన్ని ప్రజలంతా
అంగీకరిస్తారనుకోవడం కల్ల. భారతదేశం ఎప్పుడు ఏక రాజ్య పాలనలో లేదు. దానికి కారణం
భౌగోలికంగానే కాదు, ఇక్కడి ప్రజల స్వాతంత్ర్ యాలోచనల విధానం.
అలాగే ప్రస్తుత
భారత దేశం మన రాజ్యాంగాన్ ప్రకారం కూడా వివిధ జాతుల సమాహారం. దానికి అనుగుణంగానే
రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోన్నాం. రాజ్యంగా స్పూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రాలకు
ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి యునియన్ ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మద్య
సమన్వయము తో వ్యవహరించాలి.
మన దేశం లో అది
కాంగ్రెస్ పార్టి కాని, భారతీయ జనతా పార్టి కాని, ఏక వ్యక్తీ పాలన కాని ఏక పార్టి
పాలనా కాని సరికాదు. యూరోప్ దేశాలలో ఉండే పరిస్తితి మనదేశం లో లేదు. అక్కడి దేశాలు
అన్ని చిన్న దేశాలు. జనభారీత్యా కాని, భౌగోళికంగా కాని వాటిని మన దేశంతో
పోల్చలేము. జవహార్ లాల్ నెహ్రు కాలం నుండి ఇందిరాగాంధీ వరకు ఏక వ్యక్తీ లేదా ఏక
పార్టి పాలనే మన దేశం లో కొనసాగింది. అప్పటి పర్తిస్తితులు, ప్రజలలో ఉండే చైతన్య
స్తాయి, సామాజిక ఆర్ధిక రంగాలలో అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులకు అనుగుణంగా
ఇప్పటి ప్రజలు ఏక వ్యక్తీ పాలనను కాని ఏక జ్పార్తి పాలనను కోరుకోవడం లేదు.
వివిధ
రాష్ట్రాలలో ఆయా ప్రజల స్తానిక అవసరాలను ఆకాంక్షలను కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ నేర్వేర్చలేదనే గత 40 సంవత్సరాలలో వివిధ
రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఒక్క గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్
రాష్ట్రాలు మినహా మిగత అన్ని రాష్ట్రాలలో స్తానిక రాజకీయ నాయకులు తమ స్వంత ప్రజల
అభివృద్ధి కోరకు స్వంత్ర పార్టీలు పెట్టి
అధికారాన్ని చేజిక్కించుకొన్నారు.
కాంగ్రెస్ పార్టి
స్వాతంత్రం తెచ్చిన పార్టి అనే గౌరవం ఉన్నా డిల్లి లాంటి సుదూరం లో ఉండే నాయకులకు,
ఎక్కోదో తిరువనతపురం, మణిపాల్ హైదరాబాద్, ;చెన్నై లాంటి సుదూర ప్రాంత ప్రజల
అభీష్టాన్ని గ్రహించి న్యాయం చేయలేరనే విషయాన్ని గ్రహించిన స్థానిక నాయకత్వం లేదా
కొత్త నాయకత్వం కొత్త పార్తిలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసాయి.
ఉత్త భారత
పార్టీల నాయకత్వం ఎప్పుడు వారి నాయకత్వాన్ని బలపరుచుకొనే ప్రయత్నాలే చేసాయి కాని
ఇతర ప్రాంత నాయకులను గౌరవించలేదు. ఈ విషయం లో మనకు మాజీ ప్రధాని ఫై వి నరసింహ రావు మరణించినపుడు
కాంగ్రెస్ పార్టి అధికారం లో ఉందికూడా వ్యవహరించినతీరు అక్కడి నాయకుల జహానికి,
మనపట్ల ఉండే నిర్లక్షానికి ప్రతీకగా నిలిచింది. ఈ విషయం లో మిగతా పార్టీ లు ఏవి
కూడా మినహాయింపు కాదు. అంటే దక్షిణ భారత నాయకులు ఏస్థాయిలో ఉన్నా ;వారి స్థాయి
వారి ప్రాంతానికే పరిమితం చేయాలనే ధోరణి గర్హనీయం.
గత 69 సంవత్సరాల
పాలనలో జనత పార్టి, భారతీయ జనతా
పార్టి మరియు ఎం డి ఎ పాలన అంతా కలిసి
సంవత్సరాలకు మించక పోవచ్చు. మిగతా అంతా కాంగ్రెస్ పార్టి పాలనే. కాంగ్రెస్ అధికారం
కోల్పోయిన ప్రతిసారి దక్షిణ భారత దేశమే కాంగ్రెస్ పార్టికి పునప్ర్రణ ప్రతిష్ట
చేసింది. అయినా ఆపార్టీకి దక్షిణ భారత దేశం పై గౌరవం లేదనే విషయం ఫై ఉదంతం తో
తేటతెల్లం ఐంది. రాష్ట్రపతి ఎన్నికలలో నీలం సంజీవరెడ్డి ని అధికారికంగా నిలబెట్టి
అతన్ని కాదని ఇందిరా గాంధి ఆత్మప్రభోదం పేరా వి వి గిరిని గెలిపించిన సంగతి
తెలిసిందే.
1969 లో డి ఎం కే
ప్రభుత్వం రాజమన్నార్ అధ్యక్షతన వేసిన కమిషన్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల
సంబందాల పై విచారణ జరిపి అనేక విషయలాలలో కేంద్ర ప్రభుత్వ పెద్దన్న పాత్రను
ఎండగట్టింది.
డిల్లి ప్రభుత్వం
ఫెడరల్ స్పూర్తిని కాదని అనేక విషయాలలో ఆదిపత్య ధోరణి ప్రదర్శిస్తుందని అనేక
కమిషన్లు నివేదికలలో తేటతెల్లం ఐంది .
ముఖ్యంగా రాష్ట్ర
ప్రభుత్వాల ఆర్ధిక వెసులుబాటు తనాన్ని దెబ్బతీయడానికి అనేక పన్నులను కేంద్రం
విధిస్తుంది. ఇటివల చట్టం చేసి జూలై నుండి అమలుచేసే జి ఎస్ టి పన్నుల విధానం లో
రాష్ట్రాలు పూర్తిగా కేంద్రం పై దినవారి ఖర్చులకు కూడా ఆధారపడే పరిస్తితులు
రానున్నాయని ఆర్ధిక వేత్తలు చెపుతున్నారు. అన్ని క్పన్నులు కేంద్రమే వాసులు చేసి,
రాష్ట్రాలకు వివిధ పథకాలు, గ్రాంట్ల,నిధుల రూపంలో ఇస్తుంటే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు
చేసేది ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. వివిధ రాష్ట్రాల మధ్య వచ్చే తగాదాలను, ఇతర
సమస్యలను పరిష్కరించడానికి, నూతన ప్రణాలికలను అమలుకు మార్గనిర్దేశం చేయాల్సిన
కేంద్రం మొత్తం అధికారాలను కేంద్రికరిచడం అంటే రాష్ట్రాల స్వయం పాలనా శక్తిని ,
ఆత్మా గౌరవాన్ని కించ పరచడమే.
కేంద్ర ప్రభుత్వ
నియంతృత్వ విధానాన్ని అన్ని రాష్ట్రల ప్రజలు, పార్టీలు, మేధావులు అడ్డు చెప్పకపొతే
ముందు ముందు మరిన్ని నియంతృత్వ చట్టాలు కూడా కేంద్రం చేసే సాహసం చేస్తుంది.
స్తానిక రాజకీయ విభేదాలు విడనాడి భారత రాజ్యాంగ స్పూర్తిని కాదని ఫెడరల్
విధానాన్ని కాలరాచే ఒక ప్రాంత ఆదిపత్య ధోరణిని వ్యతిరేకించాలి.
(publishe in Namaste Telangana on 21
June 2017)
సిహెచ్ వి ప్రభాకర్
రావు
సీనియర్ జర్నలిస్ట్
౩౦౩ ఎటర్నల్ కృష్ణ ,రోడ్ నం .4
హరిపురి కాలనీ, కొత్తపేట హైదరాబాద్ 5౦౦ ౦35
సెల్: 9391533339
Email: chvprabhakarraomail.com


No comments:
Post a Comment