దక్షిణా పథం ఎవరి ఆదిపత్యాన్ని సహించదు.
సిహెచ్ వి
ప్రభాకార్ రావు,
సీనియర్
జర్నలిస్ట్.
ఆర్యమాతరం వందే
ఆర్యమాతరం అనే సూక్తి ని గౌరవించే మనం మన ప్రక్క వాడి రంగు జాతి ప్రాంతం అంటూ వాడి
వ్యక్తిత్వాన్ని కించపరిచే నీచ స్తాయికి దిగిపోయిన ఈ సంస్కృతి ని ఇంకా పెంచి
పోషించాల్సిన అవసరం ఉందా? ప్రపంచంమే ఓ కుగ్రామం గా కుంచిన్చుకపోయిన ఈ అధునాతన యుగం
లో మా దే గొప్ప సంస్కృతి మాదే , గొప్ప వారసత్వం అని పాత పాట పాడుకోవాల్సిన కుచ్చిత
మనస్తత్వాలను కడిగి పారేసి నూతన సంస్కృతిని ఏర్పరచుకోవాల్సిన కొత్త నాయకత్వం
రావాలి.
సర్వేజన: సుఖినో భావ: నే సూక్తి ని ప్రవచింఛిన
భారత దేశ పూర్వీకుల మాటలకు అర్థాలనే మార్చి, మన జనమే మనం అనే, మన సుఖమే ప్రపంచ
సుఖం అనులోనే కొంతమంది ప్రజా శ్రేయస్సునే మరిచిపోయి, కొన్ని వర్గాల శ్రేయాస్సే దేశ
శ్రేయస్సుగా మలచుకోవడమే మన దేశ దౌర్భాగ్యమ్. మన పుస్తకాలలో ఈనాడున్న భారత
దేశాపతానికి కనిష్కుడు, హర్షుడు పాలించిన భారత దేశానికి ఎలాంటి పోలికలు లేవు.
ఆఫ్గనిస్తాన్, బెలూచిస్తాన్ , కాశ్మీర్ , ఉత్తర హిమాలయ ప్రాంతాలలోని కొన్ని
జనపదలాను ఆనాడు భరతవర్షంగా గుర్తించారు.
మను వాదులు ప్రస్తావించే చాణక్యుని శిష్యుడైన
మౌర్య వంశ రాజు చంద్రగుప్తునదు పాలించింది కూడా వింధ్యపర్వతాలకు పైనే నర్మదా నదికి
తూర్పున గంగ నది పరివాహక ప్రాన్తమె. భారత దేశ ఇతిహససాలలో కాని పురానాలలోకాని
గొప్పవారైన సూర్యవంశ రాజులు కాని, చంద్రవంశ రాజులు కాని, కురు వంశాస్తులైన వారు
కాని మరెవరు కాని వింధ్య ప్రవత ప్రాంతాన్ని దాటి దక్షిణ భారత దేశం లో కాలుపెట్టిన
సన్ఘతనలిఉ లేవు. నామ మాత్రంగా ఎక్కోదో ఒక చోట దక్షిణ ప్రాంత ల్ప్రస్తావన ఉండవచ్చు.
అది యాదృచ్చికమే కాకుండా ఎవరో యాత్రీకు మాటలద్వారా వచ్చే ప్రస్తావనే కాని
రాజులమధ్య సంబందాలు కావు.
దక్షిణ బ్వ్హారట సంస్కృతీ సంప్రదాయాలు మొఘల్
రాజుల దండయాత్రలవరకు ప్రత్యేకంగానే ఉన్నాయి. మొఘల్ రాజులు మాత్రమె పూర్తీ స్తాయిలో
దక్షిణ భారత దేశం లో రాజ్య స్తాపనకు కృషి చేసి విజయం సాధించారు.
ఉత్తర భరతం లోని సంస్కృతి, సంప్రదాయాలు
ఎక్కువగా ఇరానియన్, మెసపటోమియా సంస్కృతుల కొనసాగింపుగా, స్తానిక తెగలతో చేసుకొన్నా
సర్డుబాట్లుగానే ఉంటాయి, ఉత్తర భారత దేశం లోని ఆనాటి స్తానిక తేగల, జాతుల ప్రజలను
అన్గాదోక్కి ఆఫ్ఘన్, ఇరాన్ ప్రాంతం నుండి రాజ్య కాంక్షతో వచ్చిన దోపిడీ దొంగలు,
పిండారులు, ఇతర బలవంతులైన తేగల నాయకుల;ఉ ఉత్తర భారతంలో తిష్టవేసారు. ఆ తరువాతే
వారే సిందు నాగరికత పేరా భారత దేశాన్ని కంబలించారు. ఈ చరిత్రలో దక్షిణ భారత
దేశానికి ఎలాంటి పాత్రలేదు. దక్షిణ బారత దేశం తన స్వంత ఉనికితో స్వతంత్ర దేశంగా,
స్వతంత్ర రాజ్యాలుగా సుభిక్షంగా ఉంది.
ఉత్తర భారతం లోని సంపదనతా దోచుకొని తమ
ఆధీనంలోకి తెచ్చుకొన్న మొఘల్ దోపిడిదారులు మరింతగా దోచుకోవడానికి దక్షిణ బారత దేశం
వైపు మళ్ళారు. ఆటరువాటే మిగాటే జాతుల వారు, ఉత్తర భారత దేశంలో నిలువ నీడ కోల్పోయిన
అక్కడి జానపద పాలకులు దక్షిణ దేశం వైపు కన్నెత్తి చూడగలిగారు.
వివిద జాతుల సమ్మేళనం ఐన దక్షిణ భారతదేశం
దండకారణ్య ప్రాంతంగా కూడా ఉత్తర భారత రచనలలో కనబడుతుంది. దట్టమైన అడవి ప్రాంతమైన
వింధ్య పర్వతాలను దాటి రాగల సామర్థ్యం కూడా ఆ రోజులలో అంతగా లేకపోవడం, గంగా నది
పరివాహక ప్రాంతమోలోనే అధిక సంపద కేంద్రీక్రుతామి ఉండడం కూడా ఉత్తర భారత రాజులకు
దక్షిణ భారతం పై అంతగా ద్రుష్టిపెత్తకపోవడానికి కారణాలు.
మొఘలుల పాలనలో ఉత్తరభారత దేశం లోని ప్రజలు పడిన
బాధలనుండి విముక్ల్తి ;కొరకే అక్కడి వారు దక్షిణ భారతానికి వలస రావడం ప్రారంభం
అయ్యింది. ఆక్రమంలోనే అక్కడి సంస్క్సృతి సాంప్రదాయాలను ఇక్కడి వారిపై రుద్దే
ప్రయత్నాలు చేసారు. క్రెస్టు పూర్వలో కూడా జనులు బౌద్ధులు దక్షిణ భారత దేశానికి
వచ్చిన వారు వారి కొత్త సంప్రదాయాలను ఒక ప్రాంతానికో, జాతికో పరిమితంయ్యారు. జైనం
బౌద్ధం దక్షిణాన ఉన్నతా స్థాయికి ఎదిగినా ఇక్కడి స్తానిక పరిస్తితులకు, జాతుల
జీవనవిధానలకు అనుగుణంగా వ్యవహరించాయి.
ప్రజలలోని మూధనమ్మకాలను తొలగించి, జాతి, వర్ణ
విచక్షణ లేని కొత్త జాతిని తయారు చేయాలనే ప్రయత్నించాయి. ఇక్కడి రాజులైనా శాంతి
పూర్వక వాతావరణంలో ప్రజలందరితో కలిసిమెలిసి ఉన్నాఋ. దక్షిణాన యుద్ధాలు లేకపోవడం ఆర్ధిక స్థితిగతులు చక్కగా
ఉండడం వల్లనే కళలు అనేక విధాల అభివృద్ధి చెందాయి. సంగీత సాహిత్యం తో పాటు శిల్ప
కళకు దక్షిణ భారతమే నిలయం. గుళ్ళు గోపురాలు అన్ని విశాలంగా మనసులను దోచుకొనే
ఆకర్షనీయమనిన అందమైన శిల్పాలకు, విగ్రహాలకు దక్షిణ భారత దేశం నిలయం. ఉత్తరార్ భారత
దేశం లో శిల్పకళ ప్రాదాన్యత గల కట్టడాలు ఒకటో రెండో ఉండవచ్చు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు, రాజ్యాలు
ఉన్నపుడే సంవత్సరాల తరబడి శ్రమించి ఈ మహా కట్టడాలు కట్టడం సాధ్యం అవుతుంది. అవి ఎ
కాలం లో కట్టినా మొఘల్ సామ్రాజ్య విస్తరణకు ముందే అని చెప్పవచ్చు.
అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన దక్షిణ భారత
దేశాన్ని, ఉత్తర భారత దేశ రాజులు తమకు అక్కడ స్థానం లేక , తమ సంస్కృతీ
సంప్రదాయాలకు గౌరం లేక వాటిని కాపాడుకొనే ప్రయత్నం లోనే దాక్షినానికి వచ్చారు.
దక్షిణం లో ఉత్తరానికి పూర్తీ వ్యతిరేకమైన నాగరికత సంస్కృతి ఉంది. ఇక్కడి ప్రజలలో
ఉన్నత నీచ నిమ్న స్థాయి అనే భేదాలు లేకున్దేవి. ఇక్కడి ప్రజలు నల్లగా, పొట్టిగా
ఉండేవారు.
ఆజానుభాహులిన్ ఇరానియన్ తెగకు చెందిన వారి సంక్రమనతో
ఎదిగిన ఉత్తర జాతి భారత దేశ రాజులు, ఆతరువాత నాయకులు దక్షిణ భారత దేశ ప్రజలపై
అధికారాన్ని చేలోఆయించే ప్రయత్నాలు ప్రారంభించారు. వేల సంవత్సరాలు గడిచినా ఈ
పోరాటం, ఈ ఉత్తర భారత జుతుఅల మధ్య గల భేదాలుయ్ ఇంకా సమసి పోలేదు.
ఇప్పట్టికి ఉత్తర భారత దేశ నాయకులలో దక్షిణ
భారత ప్రజలంటే ఓ అనాగరికులు, నల్లవారు, పోట్టివారనే ఎహ్యభావన ఉంది. వీలైనప్పుడల్లా
ఉత్తర భారత నాయకులు ఆర్య సంస్కృతి పేరా దక్షిణ భారత ప్రజలను అణచివేయాలని
ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా ఎదిగిన దక్షిణ భారత దేశం
ఇప్పాటికి ఉత్తర భారతం కన్నా ప్రశంత ప్రదేశం.
భౌగోళికంగా కాని వాతవరాన్య రీత్యాకాని దక్షిణ
దేశం ఏంటో సమున్నతమైనది. దక్షిణ భారత నాయకులలో ఉన్నంత సమ దృష్టి, సౌభాతృత్వ ధోరణి
లేని ఉత్తర భారత ప్ర్రాంత రాజకీయ నాయకులు సంఖ్యా రీత్యా అధికంగా ఉండడం ;వాళ్ళ
దక్షినదేశాన్ని అనచే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈనాడు దక్షణ భారత దేశం లోని నాల్గు ప్రధాన
రాష్ట్రలలలో ఉన్న ప్రబ్భుత్వాలను తమ చెప్పుతెలలోకి తెచ్చుకోవడానికి కేంద్ర
ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తూనే ఉంది. భారత రాజ్యాంగం ఒక ఫెడరల్ రాజ్యాంగం కాని
అటు కాంగ్రెస్ జ్క్ప్రభుత్వం కాని, ఈనాటి ఎన్.డి . ఎ ప్రభుత్వం కాని ఎ రోజు కూడా
ఇక్కడి నాయకులకు గాని ప్రజలకు గాని సముచిత గౌరవం ఈయలేదు. రెండు తెలుగ
రాస్ష్ట్రాలలోకాని, తమిళనాడులో కాని అటు కేరళలో కాని ప్రాంతీయ ప్రభుత్వాలను
ఎప్పుడు కూలదోడ్డామా అనే ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వాలు ఆలోచిస్తుంటాయి.
ఉత్తరభారతం లోని రాష్ట్రాలలో ఉండే ప్రజల,
నాయకుల అడుగులకు మడుగులోత్తే బానిస మనస్తత్వం గల వారినే ఉత్తర భారత నాయకులు చేరదీసి
వారి అదీనంలో ఉంచుకోవాలనే క్రూర మనస్తత్వం వారిది.
ఈ నాడు అధికారంలో ఉన్న ఎన్.డి.ఎ.ప్రభుత్వం,
ముఖ్యంగా బి జే పీ నాయకులు దక్షిణ దేశంపై దండెత్తినట్లే ప్రచారం చేస్తున్నారు.
వారి కను సన్నలలో లేని వారంతా దేశ ద్రోహులుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి
ప్రభుత్వాలను లోన్గాదీసుకోవాలని, తమ చేతిలోని అధికార యంత్రాంగాని అంతా
వాడుకొంటున్నారు.
తమిళనాడు, కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్,
కేరళ రాష్ట్రాలలో మాత్రమె రాజకీయ అవినీతిపరులు, అక్రమసంపాదన పరులు, లంచాగొండ్లు
ఉన్నారా? ఇక్కడివారి గురించే రోజో ప్రకటన వస్తుంది. దక్షిణ భారత దేశ నాయకులు తప్ప
దేశం లో అంటా మంచివారే అనే భావన ప్రజలలో, ముఖ్యంగా యువతలో చొప్పించే ప్రయత్నం చేసి
విజయం పొందగలిగిన పార్టి బి జే పీ. భారతీయ జనతా పార్టి అంతే ఉత్తర భారాత
వ్యాపారవర్గమే అనే సత్యం అందరికి తెలుసు. ఆ జ్పార్తిని నడిపేది మరో వ్యాపార వర్గ
సందాన కర్త రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్. ఈ రెంటి లక్ష్యం, గమ్యం ఒకటే. భారత దేశం
అంతటా వారి వ్యాపార సామ్రాజ్యాన్ని స్తాపించడమే. అదే వారి ఆర్ధిక సిద్ధాంతం. అందు
ఆంగ్లేయులు మన సంపద ద్కోచుకొంతున్నారని పారద్రోలితే, ఈ రోల్జు మన జ్పక్కవారే,
మనవారేనాటు దోచుకొంతున్న్నారు.
కేంద్రం లో ఉన్న ప్రాభుత్వానికి దేశం లోని
అన్ని రాష్ట్రాలో మంఛి ప్రభుత్వాలు స్థిరమైనవి కావాలి కాని అవి తమ పార్తివే
కావాల్సిన ఆవాసం ఏమిటి? ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలన్నీ స్వయం ప్రతిపత్తి కలవే.
కాని నిన్నటి కాంగ్రెస్ కాని, నేటి ఎన్.డి. ఎ. ప్రభుత్వంకాని.లేదా బి జే పీ
ప్రభుత్వం కాని రాష్ట్ర్రాల స్వయం ప్రతి;పట్టిని కాపాడుతున్నాయా ఆలోచించాలి.
కేంద్రానికి మద్దతు పలికేవారంతా గొప్ప వారు, వ్యతిరేకిన్చేవారంతా దేశ ద్రోహులు అనెసిద్దాంతం
ఎంతవరకు సరియినదో మేధావులు ఆలోచించాలి. ఒక దేశం లో శత్రువుల ద్రోహచింతన కంటే ఆ
దేశం లోని మేదావులమౌనమే దేశానికి ప్రజలకు ఎక్కువ నష్టం చేస్తుంది.
భారత ఫెడరల్ రాజ్యబ్గా వ్యవస్థపై నమ్మక లేక
కేంద్ర్ర్కరుత అధికారాన్ని కోరుకొనే నాయకత్వం వాళ్ళ దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే.
జర్మన్ లో హిట్లర్ అయినా మన దేశం లో గాడ్సే ఐనా
లేక మరో చోట మరే నాయకుడు అయినా వ్యతిరేకించింది
స్వేచ్చా స్వాతంత్రాలను మాత్రమె.
తమ సిద్దాంతాలు మాత్రమె గొప్పవని, తామే పాలకులమే అహంభావం తో ప్రపంచ శాంతికి భంగం
కలిగించారు.
అలాంటి మనస్తత్వం కల వారు మల్లి మనదేశం లో పాలన
చేయాలనుకోవడం, ముఖ్యంగా ఉత్తర భారత సంస్కృతి, భాషలను దక్షిణ దేశ ప్రజలపై రుద్దాలని
చూడడాన్ని వ్యతిరేకిన్చాలి. భిన్నత్వం లో ఎకత్వమే కాని ఏకీకృత కేంద్రీక్రుతమైన
సామ్రాజ్య పాలనా భావనలో భారత దేశ అభివృద్ధి ఎన్నడు సాద్యం కాదు. అది ఈ దేశ సంస్కృతి
నాగారికత కూడా కాదు.
భారతదేశ అభివృద్ధి, ముఖ్యంగా దక్షిణ భారత్ దేశ
ప్రజల ఆలోచనలు అన్ని వేళలల స్వతంత్రమైనవి. స్వేచ్చా భావనలతో స్వీయ అనుభవాలతో, నూతన
ఒరవడులను సృస్తించే సత్తా కల దక్షిణ భారత ప్రజలు ఎప్పుడు ఎవరికీ బానిసల కాలేరు.
ఉత్తర భారతీయ ప్రజలతో శాంతి సౌభ్రాత్రుత్వ్వాలను
కోరుకొనే దక్షిణ భారతీయులు,ఎన్నటికి వారి ఆధిపత్యాన్ని అంగీకరించారు. దక్షిణ భారత
దేశ ప్రజల ఆకాంక్షలను గుర్తెరగని నాయకులకు ఎలా బుద్ధి చెప్పాలో కూడా వీరికి
తెలుసు. ఇంతకాలం ఉత్తర భారత భావ దాస్యానికి గురైన ఇక్కడి నాయకత్వం ఇక్కడి ప్రజల
మనోగాతాన్ని ఎరిగి మరి ప్రవర్తించాలి. లేకుంటే ఇక్కడి రాజకీయ నాయకత్వంపైకూడా
తిరుగుబాటు రావచ్చు. దక్షిణ భారతం తన ప్రత్యెక ఉనికిని, భాషను, సంస్కృతిని, జాతిని
కాపాడుకోవడానికి అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. ఎన్ని ఎగుడు దిగుడు ప్రయానాలున్నా
దక్షిణ దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడం లో కూడా ముందే ఉంటుంది. రాజకీయంగా
కాని, ఆర్థికంగా కాని వేరే ప్రాంత నాయకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం లో ఇక్కడి
యువత ఆలస్యంగా ప్రతిస్పందిస్తుందేమో కాని అది వాలి అలసత్వం కాదు.
Ch.V.Prabhakar Rao
Educationist & Senior journalist.
303 Eternal Krishna, Road No.4,
Haripuri
Colony,Kothapet.
Hyderabad 500 035
Cell: 939 153 3339
Email. chvprabhakarrao@gmail.com

No comments:
Post a Comment