పొలిసు చరిత్రలోనే ప్రభుత్వాదినేతతో మొదటి సమాలోచన
సిహెచ్ వి ప్రభాకర్ రావు,సినియర్ జర్నలిస్ట్.
దేశం మొత్తం , ప్రజలందరూ,
వివిధ వర్గాలుగా విభజించి అడిగినా కోరుకొనేది ఒక్కటే. అది శాంతియుతంగా అందరు
సహజీవనం చేయాలని.; మనిష పుట్టినప్పటినుండి కోరుకొనేది శాంతి, సౌభ్రాతృత్వం. ఛిన్నాపెద్ద అనే
తేడాలేకుండా , బీదాబిక్కిఅనే తారతమ్యాలు లేకుండా కలిసిమెలిసి ఉండే నందనవానమే దేశం.
రామరాజ్యం అంటే ఎదో ఊహల ప్రపంచం కాదు. అన్ని తరగతుల ప్రజలకు అన్ని అవసరాలు సరియిన
సమయంలో సరియిన విధంగా సమకూరదడమే. ఒకరిపట్ల ఒకరు ద్వేషభావంతో, తగవులాడుకొంటు ఉండే
ప్రపంచాన్ని ఆకలి తీర్చుకోవడానికి దొంగతనాలు, హత్యలు దోపిడిలు లేని రాజ్యమే
రామరాజ్యం.అదే నిజమైన సంక్షేమ రాజ్యం. కమ్యునిజం అయినా పెట్టుబడిదారు ప్రభుత్వం
అయినా పజల సంక్షేమమే ముఖ్యం అనుకొన్నపుడు ప్రజలకు అవసరమైన సేవలు ఎలా అందించాలానేదే
ప్రధానమైన ప్రశ్న కాని అవి ఎ చట్టాల, ఎనియమనిభందనల చట్రం లో ఇముడుతాయా అనే సందేహం
లేకుండా అన్ని రంగాలలో నిబద్దతతో, నిజాయితితో కృషి చేయాలి.అలా చేయాలనే తపన ఉన్న
నాయకుడే నిజమైన ప్రజానాయకుడు.అలాంటి కళలను నిజమ్చేయగాలిన ప్రభుత్వానికి అండదండలుగా
ఉండాల్సింది పొలిసు శాఖ. ఈ శాఖ గౌరవాన్ని ఇనుమదిమప చేస్తున్నది ముఖ్యమంత్ర్ కల్వకుంట చంద్రశేఖర్ రావు పాలన. పొలిసు శాఖ
పట్ల ఆయన ప్రత్యెక శ్రద్దపెట్టి వారి సమస్యల పరిష్కారానికి సుపరిపాలనాలో వారిని
భాగస్వాములను చేయడానికి ముఖ్యమంత్రిగానే కాకుండా ఒక సామాజికసమస్యలను పరిష్కరించే
మేధావిగా ఆలోచించి, మిగతా అన్ని శాఖలకంటే పొలిసు శాఖ ప్రత్యెకత కలిగినదానిలా
గుర్తించి పలుసంక్సరనలకు బాటలు వేస్తున్నాడు.
దశాబ్దాలుగా తమ
ఆశలను, ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఎన్నో ఉద్యమాలుచేసి, ఎన్నో ప్రాణాలను
అర్పించినా తెలంగాణా ప్రజల ఆకలి గోస, ఆత్మగౌరం ఆకాంక్ష నిన్నటి తెలంగాణ ఉద్యమంతో
నెరవేరింది. ఆత్మగౌరవం నిలబడింది అభివృద్ధి జరగాలి. అభివృద్దిలో శాంతి భద్రతలు
సామ్రాస్యమైన, ఆహ్కాదకరమైన వాతావరణం రాష్ట్రం లో ఎంతో అవసరం. రాష్ట్రంలో శాంతి
భద్రతలను కాపాడాల్సిన పోలిసు సిబ్బంది, అధికారులు మొత్తం వ్యవస్థ అంతా గత
ప్రభుత్వహయాంలో ఏంతో నిర్లక్ష్యానికి గురైంది. ఎన్నడో దోపిదిదారులైన ఆంగ్లేయుల కాలం లో, 1861లో చేసిన చట్టానికి ఏవో అవసరార్థం కొన్ని ఆతుకుల సవరణలతో చేసిన
చట్టాల ఆధారంగా నిర్వహించబడుతున్న పోలిస్ శాఖ పట్ల, అందులో పనిచేసే వారిపట్ల
సమాజంలో భయమే తప్ప గౌరవం లేదనడం అతిశయోక్తి కాకపోవచ్చు. పోలిస్ స్టేషన్లకు పోవడం
అంటేనే ఎదో నేరం చేసినట్లు, అవమానానికి గురైనట్లు భావించి ఆత్మహత్యలు కాహేసికొన్న
సంఘటనలు ఎన్నో ఉన్నాయి, పోలిస్ స్టేషన్
అంటేనే అదో యమకూపోఆనికి ప్రతీక అనే దశనుండి ఇప్పుడిప్పుడే తెలంగాణా ప్రజలు పోలిసులపట్ల
గౌరవాన్ని పెంచుకొంటున్నారు,
తెలంగాణా
ఉద్యమకాలంలో పోలిస్ లు ఉద్యమకారులకు సహకరించడమే కాకుండామ తెలంగాణా రాష్ట్రం
ఏర్పడితే పోలిస్ బతుకులు కూడా మారుతాయన్న భావనలో ఉన్న్దేవారు. మరో వైపు తెలంగాణ
రాష్ట్రం ఏర్పడితే మల్లి నక్సలైట్ల అరాచకాలు మితిమీరిపోతాయని ప్రచారం చేసారు. తెలంగాణలో ముసలి జనాభా ఎక్కువమ
అందులో హైదరాబాద్ లో మరి ఎక్కువ , ముసలి ఉగ్రవాదానికి తెలంగాణలో ఉటం దొరికే
ఆవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా ప్రచారం చేసారు. ఈ దశలో ఏర్పడా తెలంగాణ రాష్ట్రం
ఉద్యమ కాలంలో వైరి పక్షాలు వెలిబుచ్చిన అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ ప్రశాంతంగా
కొనసాగడమే కాకుండా దేశ స్తాయిలో తెలంగాణా పోలిస్ శాఖ పనితీరు గుర్తింపు
తెచ్చుకోవడం తెలంగాణ ప్రజలందరికి గర్వకారణమే కాకుండా ప్రజల నిబద్దత,ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు
చిత్తశుద్ది నాయకత్వ ప్రతిభకి నిదర్శనాలుగా నిలుస్తాయి.
ముఖ్యంగా
‘ప్రతి-గూదాచర్యం “ (కౌంటర్
ఇంటలిజెన్స్ ) విషయంలో తెలంగాణా పోలీసులు సాధించిన ఘనత నిజంగా సిద్ధాంతాలకు
అతీతంగా శ్లాఘనీయం. దేశం లో జరిగే ఉగ్రవాద చర్యలకు సంబంధించిన విషయాలలో కూడా
తమకేండుకు అని నిర్లక్ష్యం వహించకుండా జాగురుకతతో వ్యవహరించి, తమ వద్ద ఉన్న
సమాచారాన్ని ఇతర రాష్ట్రాల పోలిస్ శాఖలతో పంచుకోవడం వక్క్ దేశం లో అనేక ఉగ్రవాద
చర్యలను ఆరికట్టాడంలో తెలంగాణా ఓళీఊళూఈ నిరుపమాన సేవలు అందించాఋ. తెలంగాణ పోలిస్లు
ఇచ్చిన సమాచారం మేరకే ఇటివల మధ్యప్రదేశ్ లో జరిగిన రైల్వే ప్రమాదానికి కారకులైన
ఉగ్రవాదులను అక్కడి పోలిస్లు పట్టుకోగలిగారు.
రాత్రనక పగలనక
ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న పోలిస్ సిబ్బంది సేవలను గుర్తించి, తగు రీతిన
అభినందించిన ప్రభుత్వాలు లేవు. మంచిజరిగితే ప్రభుత్వాధినేతల వ్యుహరచనల విజయం అని,
చెడు జరిగితే అది శాంతి భద్రతలను కాపాడలేని పోలిసుల వైఫల్యం అని అందరు విమర్శించడం
ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది. కాని పోలిసుల పనితీరును చూపించి వోట్లు అడిగిన ఘనత ఒక్క
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానిదే., అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు
చానక్యనీటి సాధించిన విజయమే అని చెప్పవచ్చు .పొలిసు శాఖలో ఉన్నంత సబార్తినేజం మరే
శాఖలోనూ ఉండదనే విషయంలో మరో మాట ఉండదు. ఒక కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ స్తాయి
అధికారితో కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేదు. డివిజనల్ పొలిసు అధికారి కూడా ఒక
డి, ఐ, జి స్తాయి అధికారితో మాట్లాడలేని వ్యవస్థ పొలిసు వ్యవస్థ. అలాంటి వ్యవస్తలో
ప్రపంచాస్తాయిలో మొట్టమొదటి సారిగా మారుమూల పల్లెలోని ఎస్సై స్స్తాయి అధికారిని
రాష్ట్రంలో పోలిసుశాఝాకే అత్యున్నత స్తాయి అధికారి ఐన డిజిపి అవారకు
అన్నిస్తాయిలలోని పోలిసుల అధికారులను ఒకే చోట సమావేశాపరచాదేమే ఆశ్చర్యం. అదే
కాకుండా అలాంటి సమావేశం లో రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా మాట్లాడి వారిసమస్యలను
కూలంకుషంగా చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం మరో అరుదైన సంఘటన.
ఈ సమావేశం
ఏర్పాతుచేయమని డిమాండ్ చిసింది ఎవరులేరు. తెలంగాణా రాస్జహ్త్రం ఏర్పడడా కొత్తలోనే
౫౦౦ లకోట్ల నిధులతో వారికి కావాల్సిన వాహనాలను సమకూర్చిన ఘనత తెరాస
ప్రభుత్వాదినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ దే.
1802 నుండి ఏర్పడిన 2006 లో సుప్రీం కోర్ట్ ఆదేశాల
వలన కూడా ఎ రాష్ట్ర ప్రభుత్వం పొలిసు శాఖలో సమగ్ర మార్పులకు, జవాబుదారితనానికి
అనుకూలమైన చట్టాలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్న తరుణంలో
తెలంగాణా ప్రభుత్వం ఇలాంటి సమావేశం
ఏర్పాటుచేయడం హర్షణీయం. ఈ సమావేశం వాళ్ళ కింది స్తాయి అధికారులో
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రభుత్వానికి తమ సేవలపట్ల గౌరవం ఉందని భావిన్వ్హిన
అధికారులు మరింత సమర్తవంటంగా ప్రజలకు దగ్గరగా పనిచేసే శక్తిని పొందుతారు.
పొలిసు ఆధికారుల
సేవలను వారికి ఇచ్చే జితభాత్యాలతో కొలవడం
సరికాదు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెప్పినట్లు వారిని ఉద్యోగాలలో ఉన్నపుడే
కాకుండా ఉద్యోగ విరమణ తరువాతకూడా వారికి
రావలిసిన ప్రోత్సాహకాలు, పెన్షన్ లాంటి
అన్ని ఉయోగావిరమణ రోజే ఇచ్చి, మిగత ప్రభుత్వోద్యోగులమాదిరే వారిని వారి
ఇంటి వద్ద వదిలి పెతాలనే సూచన, వారి సేవలకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపుగా
భావించాలి.
దేశ రక్షణ
ఎలాగైతే మన సైనికుల చిత్తశుద్ది, కాటార శ్రమ పై ఆధారపడి ఉందొ అలాగే రాష్ట్ర
అంతర్గత భద్రత పొలిసు శాఖపై ఆధారపడి ఉంది. ఒక్క శాంతి భద్రతలే కాదు ఎక్కడ ఎ
విపత్తు వచ్చినాం ఎ సభాజరిగినా , ఎ పండగ వచ్చినాం అహర్నిశలు కృషిచేసి ఆయా
కార్యక్రమాలను విజయవంతం చేసేది పొలిసు సిబ్బందే అనే విషయం మరిచిపోకూడదు.
పోలీసులకు
సమాజంలో తగిన గౌరం ప్రజలనుండి లభినోఅచేయడంలో ప్రభుత్వ పాత్రను గుర్తించే
ముఖ్యమంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేసిన్దవచ్చు. అన్దేసమయంలో వారి సమస్యలను కూడా సూచనల
రూపంలో ఆహ్వానిచడం అంటే, ప్రభుత్వం పొలిసు సిబ్బందిని మిగతా ప్రభుత్వోద్యోగులులానే
సగౌరవంగా సమాజంలో సముచితస్తానం కల్పించాలనే ప్రయత్నాలు ప్రారంభించిందని
చెప్పవచ్చు. పోలిసుల పని ఒత్తడి తగ్గించే విషయంలో , వారిపనిలో రాజకీయ జోక్యం
తగ్గించే విషయం లో ప్రభుత్వం మరింత
క్రుశిచేయనుండానే ఆశావాహ పరిస్తితులు ఈ సమావేశం వాల్ పొలిసు సిబ్బందిలో కలిగింది.
నిజాయితిగా ,
నిస్పక్షపాతంగా పనిచేసే పొలిసు సిబ్బందికి, ఉన్నతోద్యోగులకు ఇలాంటి సమావేశాలు ఒక
ఆత్మా స్తైర్యాన్నిస్తాయి. ఈ సమావేశం లో బృందాలుగా విడిపోయి పొలిసు అధికారులు
చేసిన సూచనలను, ఫిర్యాదులను ప్రభుత్వం చిత్తశుద్దితో పరిశీలించి, వాటికి
పరిష్కారమార్గాలు కనుగోనాల్సిన ఆవశ్యకత ఏంతో ఉంది. ఆయా సమస్యల పరిష్కారానికి ఈ
సమావేశమే మూలాధారం అని, ఇదే పుష్ట భూమిగా ఉపయోగపడుతుందని గ్రహించాలి.
Ch .V. Prabhakar Rao
Senior Journalist
303 Eternal Krishna, Road No.4
Haripuri Colony. Kothapet
Hyderabad 500 035
Cell:9391533339
Email: chvprabhakarrao@gmail.com
.

No comments:
Post a Comment